విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షి టీం పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. బుధవారం ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో షి టీం పై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.