రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జిన్నింగ్ మిల్లును రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.