కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం సరికాదని కార్యదర్శి వి. పర్వతాలు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మండల మహాసభ నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతోన్మాదాన్ని పెంచుతూ మత ఘర్షణలు సృష్టిస్తోందని ఆరోపించారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.