సమాజ శ్రేయస్సే లక్ష్యంగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేలా పార దర్శకత పెంపొందించుకొనేవిధంగా ఆర్టీఐ రక్షణ చట్టం కార్యకర్తలు పని చేయాలని ఆర్టీఐ రక్షణ చట్టం రాష్ట్ర అధ్యక్షుడు గద్దె శ్యాంప్రసాద్ కోరారు. ఆదివారం కల్వకుర్తిలోని గ్రీన్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఆర్టీఐ రక్షణ చట్టం నాల్గవ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నాయకులు పలువురు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి ఆర్టీఐ కార్యకర్తలు వారధిగా పని చేయాలన్నారు.