మక్తల్: వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ

60பார்த்தது
మక్తల్: వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ పెద్ద చెరువులో 40 వేల చేప పిల్లలను విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువులో సబ్సిడీతో అందించే చేప పిల్లలను విడుదల చేస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி