పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. బుధవారం యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని హంగులతో నిర్మించిన హాస్టల్ భవనం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. జీఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.