పాలమూరు ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ - మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ - జి. రాజేందర్, వనపర్తి - జి. గోవర్ధన్, జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణపేట -వరాల విజయ్ కుమార్ ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్ గా నియమించింది.