దసరా పండుగకు పల్లెలకు వచ్చిన ప్రజలు తిరిగి పట్నం బాట పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సోమవారం హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి-44 టోల్ ప్లాజాల వద్ద వందల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి. బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ, దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో. జనాలు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టోల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.