సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహా ధ్వంసం ఘటనపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ సీరియస్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవరిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ద పనితీరు వల్లే హిందూ ఆలయాలు, దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మతవిద్వేశ కార్యకాలాపాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు.