దేవరకద్ర నియోజకవర్గం నాగరంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సాయంకాలం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ రూ. 2, 320, బీ గ్రేడ్ రూ. 2, 300, సన్నరకానికి అదనంగా రూ. 500 బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.