గద్వాల్ లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో గల ప్రభుత్వ ఐ.టి.ఐ గద్వాల్, నందు ప్రధానమంత్రి నేషనల్ అప్ప్రెంటిషిప్ మేళా ఈనెల 11న నిర్వహించడం జరుగుతుందని గురువారం ఐటిఐ ప్రిన్సిపల్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐ పాసైన అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో 11వ తేదీ ఉదయం 10:00 గంటలకు గవర్నమెంట్ ఐ.టి.ఐ కాలేజీలో హాజరుకాగలరు.