జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డె రాజేశ్వరి మృతికి కారకులైన నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క హస్తం దాగి ఉందని బాసు హనుమంతు నాయుడు అన్నారు. గత వారం రోజులుగా కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్లి, గద్వాలకు చేరుకున్న అనంతరం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డె రాజేశ్వరి కుటుంబాన్ని బాసు హనుమంతు నాయుడు శుక్రవారం పార్టీ నాయకులతో కలిశారు.