పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ గుల్ ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 'కొవిడ్ మొదటి దశ సమయంలో నా ప్రాణ స్నేహితుడు కలీమ్ యాక్సిడెంట్లో మృతిచెందారు. రంజాన్ పండుగకు రెండ్రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయా. అందుకే క్రికెట్కు గుడ్ బై చెప్పా. ఈ విషయం నా భార్యకు కూడా తెలియదు' అని గుల్ భావోద్వేగానికి లోనయ్యారు.