మార్క్‌ శంకర్‌ పేరు మీద తిరుమలలో అన్నదానం

75பார்த்தது
మార్క్‌ శంకర్‌ పేరు మీద తిరుమలలో అన్నదానం
తిరుమలలో కుమారుడు మార్క్‌ శంకర్‌ పేరు మీద పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అన్నదానం చేపట్టారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో అన్నా లేజినోవా మొక్కు కోవడంతో శనివారం తిరుమలను దర్శించుకొని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడి పేరు మీద అన్నదానం చేపట్టడానికి రూ. 17 లక్షలు విరాళంగా అందజేశారు.

தொடர்புடைய செய்தி