కునో జాతీయ పార్కులోని ఖేజురి అడవిలోకి ఐదు చీతాలను అధికారులు విడుదల చేశారు. నమీబియా నుంచి తీసుకువచ్చిన జ్వాలతో పాటు దానికి జన్మించిన నాలుగు కూనలను ఎన్‌క్లోజర్ల నుంచి అడవిలోకి విడుదల చేశారు. ఈ మేరకు అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ డైరెక్టర్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 12 చీతాలను అడవిలోకి వదలగా.. ఇంకా 14 చీతాలు ఎన్‌క్లోజర్లలో ఉన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.