టమాటో రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. టమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. దీని జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లైకోపీన్ ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం.. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.