బిహార్లోని పట్నాలో 'పుష్ప- 2' ఈవెంట్కు అనూహ్య స్పందన వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గాంధీ స్టేడియం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన పుష్పరాజు చూసేందుకు.. ఏకంగా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన పిల్లర్స్ పైకి ఎక్కేశారు. నార్త్ ఇండియాలో మన తెలుగు హీరోకు భారీ క్రేజ్ ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈవెంట్ కు దాదాపు 2లక్షల మంది వచ్చినట్లు అంచనా.