ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత రుగ్మతలకు, స్ట్రోక్‌కి దారితీస్తుంది. అధిక ఉప్పు తీసుకోవడం మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఎక్కువ ఉప్పు గుండెతో పాటు మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు.