తెలంగాణలో అక్రమార్కులకు వణుకు పుట్టిస్తున్న హైడ్రాపై రోజుకోక వార్త సంచలన అవుతోంది. అక్రమ నిర్మాణాలు నిర్మూలనే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా హైడ్రాపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.