తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కృత్రిమ రంగులను ఉపయోగించవద్దని సూచించారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు హోలీ పండుగను జరుపుకుంటారన్నారు.