సీఎం రేవంత్ సంచలన నిర్ణయం?

25400பார்த்தது
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం?
తెలంగాణలో సీఎం రేవంత్ తన మార్క్ చూపేలా పాలన చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పాలనలో ఉనికిలోకి వచ్చి ఇప్పటికీ అమలవుతున్న స్కీమ్‌లలో కొన్నింటిని పక్కన పెట్టేందుకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం టీఎస్ గా ఉన్న అబ్రివేషన్ ను టీజీగా మార్చారు. అలాగే ప్రభుత్వ అధికారిక ఎంబ్లమ్(లోగో)లో మార్పులు, మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, టీఎస్-ఐపాస్ పాలసీ విభజన వంటి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆగస్టు తర్వాత కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్నారట.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி