రేపు కొడంగ‌ల్‌కి సీఎం రేవంత్ రెడ్డి

80பார்த்தது
రేపు కొడంగ‌ల్‌కి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు ఆదివారం తన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్‌కు వెళ్లనున్నట్టు వ్యక్తిగత సహాయకుడు సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఏడాది దసరా పండుగ రోజు సొంతూరు కొండారెడ్డిపల్లి, ఆ తరువాత రోజు కొడంగల్‌కు వెళ్లడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీ. అదే ఆనవాయితీ సీఎం హోదాలో తొలిసారిగా కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలను, కార్య‌కర్తలను సీఎం రేవంత్ రెడ్డి కలువనున్నారు.

தொடர்புடைய செய்தி