TG: రాష్ట్రంలో మరోసారి టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటన కలకలం రేపింది. కామారెడ్డిలో జిల్లాలో ఘటన వెలుగు చూసింది. జుక్కల్ జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి గణితం క్వశ్చన్ పేపర్లో పలు ప్రశ్నలు లీకైనట్లు సమాచారం. పరీక్షా కేంద్రంలో వాటర్ అందించే వ్యక్తి ప్రశ్నలు రాసుకొచ్చి విద్యార్థికి జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.