స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఈ మధ్య ఏదో రూమర్ వినిపిస్తూనే ఉంది. కానీ, తాజాగా ఈ బ్యూటీ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. కీర్తి చాన్నాళ్లుగా కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందట. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలోని వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు.