చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ విజ్ఞప్తులు

60பார்த்தது
చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ విజ్ఞప్తులు
AP: 1993లో చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో చలపతి, విజయవర్థన్ ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదుగా మారి 40 ఏళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ జీవిత ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. క్షమించరాని నేరమే అయినా ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ నేరస్థుడి భార్య అభ్యర్థన చేసింది. 2025 జనవరి 26న క్షమాభిక్ష ప్రసాదించే ఖైదీల జాబితాలో వీరివురిని చేర్చాలంటూ విజ్ఞప్తి చేసింది.

தொடர்புடைய செய்தி