TG: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఆదిలాబాద్ జిల్లాపై పడింది. పక్కనున్న మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్లో బర్డ్ ఫ్లూ బయటపడడంతో.. జిల్లాలోని జనం చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో ఆదిలాబాద్‌లో చికెన్ మార్కెట్ బంద్ అయింది. వారం పాటు చికెన్ మార్కెట్ క్లోజ్ చేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు ఘోరంగా పడిపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు వెల్లడించారు.