AP: టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఏపీ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, సోమవారం ఉదయం 9.45 గంటలకు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు.