తిరుమలలో దీపావళి ఆస్థానం దృష్ట్యా ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.