భారత టెలికం మార్కెట్లో మరో సంచలనానికి ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెరతీసింది. అతి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ అక్కడి ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొస్తోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల నుంచి 15 వేల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.