AP: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బొమ్మనహాల్ మండలం చంద్రగిరికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిని రాములు అనే వ్యక్తి వేటకొడవలితో నరికి చంపాడు. అయితే ఇరువర్గాల మధ్య ఉన్న భూతగాదాలే ఈ హత్యకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.