ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఒక మహిళను ఆమె సొంత భర్త, అతని అన్నయ్య దారుణంగా కొట్టారు. పదునైన ఆయుధంతో ఆమె ముఖం, శరీరంపై అనేక చోట్ల దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో ఆ మహిళ ముఖంపై దాదాపు 250 కుట్లు పడ్డాయి. ఆ మహిళకు చెంప, నుదురు, చెవిపై కుట్లు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.