తెలంగాణలో రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కు రైతుల ఉసురు తగులుతుందని అన్నారు.