HCU భూములు ప్రభుత్వానివైతే, రాష్ట్ర సర్కార్ తాకట్టు పెట్టడం ఎందుకు? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 15 నెలలుగా రేవంత్ రెడ్డిని బీజేపీ అన్ని రకాలుగా కాపాడు తోందని ఆరోపించారు. 'రేవంత్ రెడ్డికి బండి సంజయ్ అడ్డుగా నిలబడి ఆదుకుంటున్నాడు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే కాకుంటే ఈ మొత్తం వ్యవహారంలో విచారణ వేయాలి. RBI, సెబీ వంటి సంస్థలతో వెంటనే విచారణకు ఆదేశించాలి' అని డిమాండ్ చేశారు.