భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. ఇందుకోసం భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయాలి. ఆవు పేడతో తయారైన పిడకలు, పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.