పండుగ పూట ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. "ఊరికి వెళ్లే ముందు తమకు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. ఊరెళ్తున్న విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోరాదు. ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ వంటి పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను అమర్చుకోవాలి." అని పోలీసులు చెబుతున్నారు.