ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో చర్యలు చేపట్టినట్లు తెలిపింది.