ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. రష్మీ భుజం నొప్పికి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. రష్మీ సోషల్ మీడియాలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'భుజం నొప్పి కారణంగా డ్యాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.