AP: తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిషుణ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారావు, మౌనిక దంపతులు. జ్యోతిషుడు అప్పన్న (50) గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఆయనను ఇంటికి పిలిచింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇద్దరు ప్లాన్ చేసి జ్యోతిషుడిని చంపేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.