కాగజ్నగర్ వ్యవసాయ కార్యాలయం ముట్టడించిన రైతులు
కాగజ్నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని సోమవారం రైతులు ముట్టడించి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. వారికి మాజీ జెడ్పి చైర్మన్ కోనేరు కృష్ణ మద్దత్తు తెలిపారు.