హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో సోమవారం ఇంటింటికీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ బిజెపి సభ్యత్వం తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీలో సభ్యత్వం కోసం ప్రతి ఒక్కరు 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపారు.