మంచిర్యాల జిల్లాలో రైతుల సౌకర్యార్థం 2024 -25 సీజన్ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఏవో కల్పనతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 8 జిన్నింగు మిల్లులు ఉన్నాయని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు రూ. 7521 నిర్ణయించడం జరిగిందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.