చెన్నూరు మండలం సుందరశాల గ్రామానికి చెందిన దాసరి సాయి, అరుణ్ అనే
విద్యార్థులు శుక్రవారం గోదావరిలో గల్లంతయిన విషయం విదితమే. వారి స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.