బోథ్ నూతన మండల విద్యాధికారిగా (ఎంఈఓ) కుమ్మరి పోశెట్టి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఆయనను మండల పిఆర్టియు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెడ్ మాస్టర్స్ మహమూద్ హుస్సేన్, హన్మాండ్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.