గుడిహత్నూర్ మండలం ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై మహేందర్ ను శనివారం ఆదివాసీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివాసీ సేన మండల కమిటీ అధ్యక్షులు సేడ్మకి భీంరావ్ ఆధ్వర్యంలో ఆదివాసి సేన నాయకులు పోలీస్ స్టేషన్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆదివాసీల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాయిసిడం జంగు పటేల్, తదితరులు పాల్గొన్నారు.