గుడిహత్నూర్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త తమ వంద సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశిల సభ్యత్వాన్ని తీసుకోవాలని మండల అధ్యక్షుడు కేంద్రే శివాజీ అన్నారు. గుడిహత్నూర్ లో బీజేపీ నాయకులు కలిసి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. రాబోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.