బోథ్ లోని సోనాల గ్రామంలో పూలే వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసి పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, పూలే వెల్ఫేర్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసి హక్కుల కోసం బ్రిటిషర్లతో యుద్ధం చేసిన గొప్ప వీరుడు బిర్సా ముండా అని పేర్కొన్నారు. ఐక్యంగా ఉంటూ తమ హక్కులను సాధించుకోవాలన్నారు.