తలమడుగు మండలంలోని ఝరి గ్రామ పంచాయతీలో ఉన్న టోక్కి గూడా, శేర్ గూడా గ్రామాలను నూతనంగా ఏర్పాటు చేసిన పున్నగూడ గ్రామ పంచాయతీలో విలీనం చేయవద్దని శుక్రవారం గ్రామ పటేల్ జనక్ పటేల్ ను కోరారు. ఝరి గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు దారిలేక తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. టోక్కి గూడా, శేర్ గూడా గ్రామాలను కలిపి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.