బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాలకు చెందిన గోమాస శ్రీకాంత్ ను ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ నియామక పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, నాపైన నమ్మకంతో నాకు ఇట్టి బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘం బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని అన్నారు.