యూరియా వచ్చేసింది!

60பார்த்தது
యూరియా వచ్చేసింది!
ఖరీఫ్ సీజనులో పంటల కోసం యూరియా నిల్వలు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో రైల్వే వ్యాగన్ల ద్వారా రెండు రోజులుగా జిల్లాకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను లారీల్లో వ్యవసాయ శాఖ అధికారులు గిడ్డంగులకు తరలిస్తూ నిల్వ చేస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా యూరియా భారీగా జిల్లాకు సరఫరా అవుతుండటంతో వేసవి దృష్ట్యా పనులు లేక ఇబ్బందులు పడుతున్న హమాలీలకు ఉపాధి దొరికినట్లయింది.

தொடர்புடைய செய்தி