TG: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదని హెచ్చరించారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది.. కాబట్టి వారికి అండగా ఉన్నామని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు బురద జల్లేందుకు ప్రయత్నించాయంటూ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా అల్లు అర్జునే ముందుకు రావాలని సూచించారు.